- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతికి ఏసీబీ చెక్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
దిశ, వెబ్‌డెస్క్ : అవినీతి అధికారులకు ఏసీబీ చెక్ పెట్టింది. కూకట్ పల్లి సర్కిల్‌లో సీనియర్ అసిస్టెంట్ చాంద్ పాషా మ్యుటేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. అదేవిధంగా కూకట్ పల్లి సర్కిల్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న షణ్ముఖ ట్రేడ్ లైసెన్స్ కోసం రూ. 2500 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
సర్కిల్‌లో ఒకేసారి రెండు వేర్వేరు విభాగాల్లో అవినీతి నిరోధక శాఖ బృందాలు రైడ్ చేసి లంచం తీసుకుంటున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, ఏసీబీకి ఇద్దరు అవినీతి అధికారుల గురించి ఒకేసారి సమాచారం అందడంతో వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు దొరికాయని ప్రస్తుతం కూకట్ పల్లి సర్కిల్ కార్యాలయంలో జోరుగా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది.