రెండు బస్సులు ఢీ.. ఏడుగురు మృతి

by Sumithra |
talibans occupied afghanistan
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆప్ఘన్ రాజధాని కాబుల్‌ నగరంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా మరో 70మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story