- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుదాఘాతంతో సోదరులు బలి
by srinivas |
X
దిశ, అమరావతి: అనంతపురం జిల్లా ఉరవకొండలోని బాలాజీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న రమేశ్, మల్లేశ్ అనే ఇద్దరు సోదరులు మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. వేకువజామున బహిర్భూమికి వెళ్లిన సోదరులు నీటి ట్యాంక్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తాకారు. దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎంతసేపటికీ కుమారులు రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాలతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని బంధువులకు నచ్చజెప్పి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Advertisement
Next Story