జాతీయ గీతాన్ని చోరీ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

by Shyam |   ( Updated:2021-08-02 04:02:54.0  )
Anu-Malik
X

దిశ, సినిమా : బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుమాలిక్‌ను ట్రోల్ చేస్తున్నారు ఇండియన్ ట్విట్టర్ యూజర్స్. ఏకంగా ఇజ్రాయిల్ జాతీయగీతాన్ని చోరీ చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన ఆర్తెమ్ డోల్గోప్యాట్ జిమ్నాస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. దీంతో నిర్వాహకులు ఈ మెడల్ ప్రెజెంట్ చేసే సమయంలో సాంప్రదాయంగా ఇజ్రాయిల్ జాతీయగీతాన్ని ప్లే చేశారు. ఇది కాస్త అనుమాలిక్ సంగీతం సమకూర్చిన పాట్రియాటిక్ ఫిల్మ్ ‘దిల్‌జలె(1996)’ సినిమాలోని ‘మేరా ముల్క్ మేరా దేశ్’ ట్యూన్‌ను పోలి ఉంది.

‘ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్ పతకం గెలుచుకుంటే అది కాస్త ఇండియన్స్ అనుమాలిక్‌ను గుర్తుచేసుకోవడంతో ఎండ్ అయింది’ అని జోక్‌లు వేస్తున్నారు ట్విట్టర్ యూజర్స్. అనుమాలిక్ ఇజ్రాయిల్ జాతీయగీతాన్ని చోరీ చేయడం నిజంగా విచారకరమని, ఇంత షేమ్‌లెస్‌గా ఎలా ఉండగలిగారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ సాంగ్ ట్యూన్ కాపీ చేసిన అనుమాలిక్ విజనరీ మ్యాన్ అని, ఏ దేశం ఎన్నేళ్లుగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేదో తెలుసుకునేందుకు చాలా పరిశోధన చేసి ఉంటాడని, దాదాపు 25 ఏళ్ల తర్వాత నిజం బయటపడితే ఏముందిలే అనుకుని ఉంటాడని కామెంట్ చేశారు. అనుమాలిక్ చోరీకి ఒలింపిక్ మెడల్ రావాల్సిందే అని విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story