తూచ్.. గన్ మిస్ ఫైర్ కాలేదు.. నేనే కాల్చి చంపా!

by Anukaran |
Gun Miss Fire
X

దిశ, వెబ్‌డెస్క్ : బెజవాడ గన్ మిస్‎ఫైర్ కేసు కొత్త మలుపు తిరిగింది. హోంగార్డ్ వినోదే భార్యను కాల్చి చంపి మిస్ ఫైర్ నాటకం ఆడాడని పోలీసులు గుర్తించారు. భార్యభర్తల మధ్య ఉన్న మనస్పర్ధాల వల్లే ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలిసింది. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు వివరించారు.

హోంగార్డ్ వినోద్‌కు తన భార్య సూర్యరత్నప్రభ మధ్య నగల విషయంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగింది. దీంతో కోపోద్రిక్తుడైన వినోద్ తన వెంట తెచ్చుకున్న గన్ తో భార్యపై ఫైరింగ్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే హతమైంది. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గన్ బీరువాలో పెడుతుండగా మిస్ ఫైర్ అయిందని నాటకం ఆడాడు.

సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ దగ్గర అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు వినోద్. గత మూడు రోజులుగా నైట్ డ్యూటీ చేసిన ఆయన.. విధుల నుంచి ఆదివారం రాత్రి రిలీవ్ అయ్యాడు. అయితే ఏఎస్పీ తన గన్‌ను కారులో వదిలి వెళ్లడంతో దానిని తన వెంట ఇంటికి తీసుకువెళ్లాడు వినోద్.
ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో అదే గన్‎తో తన భార్య సూర్యరత్నప్రభను ఉద్దేశ్యపూర్వకంగానే కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. ఇదే విషయాన్ని వినోద్ పోలీసుల విచారణలోనూ అంగీకరించాడు.

కాగా, తన భార్య సూర్యరత్నప్రభ తుపాకీ చూస్తానని కోరడంతో దానిని చూపిస్తుండగా మిస్ ఫైర్ అయిందని, బుల్లెట్ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్లడం మృతి చెందిందని ఈ రోజు ఉయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మృతురాలు బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

భార్య సరదా తీరుద్దామని… చివరికి మృత్యువు ఇలా..

Advertisement

Next Story