ఈవీ మౌలిక సదుపాయాల కోసం టీవీఎస్ మోటార్, టాటా పవర్ భాగస్వామ్యం

by Harish |   ( Updated:2021-10-05 04:54:57.0  )
ఈవీ మౌలిక సదుపాయాల కోసం టీవీఎస్ మోటార్, టాటా పవర్ భాగస్వామ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన మౌలిక సదుపాయాల కోసం టాటా పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ మౌలికసదుపాయాలు(ఈవీసీఐ) నిర్వహణ, టీవీఎస్ మోటార్ సెంటర్లలో సోలార్ విద్యుత్ టెక్నాలజీల ఏర్పాటుకు ఇరు సంస్థలు అంగీకారం చేసుకున్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేసేందుకు భారీ ఎత్తున ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఛార్జింగ్ మౌలికసదుపాయాలను ఏర్పాటు చేయడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని టీవీఎస్ కంపెనీ తెలిపింది. అలాగే, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు టీవీఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్, టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్‌ల ద్వారా టాటా పవర్ ఛార్జింగ్ నెట్‌వర్క్ వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎలక్ట్రిక్ విభాగంలోకి ప్రవేశించే వినియోగదారుల సంఖ్యను పెంచేందుకు దోహదపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ‘టీవీఎస్ మోటార్ సహకారం ద్వారా దేశవ్యాప్తంగా బలమైన ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలను పెంచేందుకు వీలవుతుందని’ టాటా పవర్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ డా. ప్రవీణ్ సిన్హా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed