ఉచిత వైద్య శిబిరాలు చేయడం అభినందనీయం.. తుమ్మల పాండురంగారెడ్డి

by Shyam |   ( Updated:2021-12-03 09:22:04.0  )
medical camp
X

దిశ, పటాన్‌చెరు: పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు సాయిబాబా గుడి ఆవరణలో ఉద్భవ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, సంవత్సరానికి ఒకసారి వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణం, తీసుకుంటున్న ఆహారం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, సాధ్యమైనంత వరకు బలవర్ధకమైన ఆహార ఉత్పత్తులను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story