మంగళవారం పంచాంగం, రాశి ఫలాలు (27-04-2021)

by Hamsa |
Panchangam Rasi phalalu
X

ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : 🌕 పౌర్ణమి ఉ9.52
తదుపరి బహుళ పాడ్యమి
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : స్వాతి రా 9.47
తదుపరి విశాఖ
యోగం : సిద్ధి రా 9.43
తదుపరి వ్యతీపాతం
కరణం : బవ ఉ 9.52
తదుపరి బాలువ రా 8.40
ఆ తదుపరి కౌలువ
వర్జ్యం : ఉ.శే.వ 6.05 వరకు &
తె 2.59 – 4.29
దుర్ముహూర్తం : ఉ 8.10 – 9.00 &
రా 10.47 – 11.33
అమృతకాలం: మ 1.33 – 3.03
రాహుకాలం : మ 3.00 – 4.30
యమగండం/కేతుకాలం: ఉ 9.00 – 10.30
సూర్యరాశి: మేషం || చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.40 || సూర్యాస్తమయం: 6.13

రాశి ఫలాలు..

మేషం

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

వృషభం

ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

మిధునం

ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. మీ మాటతీరు ఇతరులకు బాధ కలిగిస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి వ్యాపారాలు ఆర్ధిక నష్టాలు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల కోపానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పాతమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి.

కన్య

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపారాలలో విభేదాలుకలుగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు.

తుల

ఆదాయవ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలోలాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మికచింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

ధనస్సు

నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం

ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతోవిందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

కుంభం

మీప్రవర్తన ఇతరులకు ఇబ్బందికలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం

ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యంసహకరించక చికాకుపెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed