- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR ఘాటు విమర్శలు.. స్పందించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ వెబ్ సైట్ నిర్వహణ బాధ్యతను జియోకు అప్పగించడంపై రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను జియో సంస్థ సబ్ డొమైన్‌లో విడుదల చేయడంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయితే ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ విమర్శలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సేవాభావంతోనే జియో సంస్థ ఈ సేవలను అందించడానికి ముందుకొచ్చిందని.. అది కూడా ఉచితంగా అందిస్తోందని వివరణ ఇచ్చారు. అయితే ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు.
జియో క్లౌడ్ ద్వారా గంటన్నర వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించినట్లు వెల్లడించారు. ఇకపోతే స్వామివారి దర్శనం టికెట్ల బుకింగ్స్‌లో నిత్యం సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని దీన్ని అధిగమించేందుకు జియో ముందుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సాంకేతిక సమస్యలను నివారించేందుకు ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు కూడా చేసినట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే నెలలో పూర్తిగా టీటీడీ డొమైన్‌లోనే దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు టికెట్ల బుకింగ్స్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి హెచ్చరించారు.
- Tags
- Andrapradesh