- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'నానమ్మ చనిపోయిన విషయం 5 నిమిషాల ముందే తెలిసింది'
దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో అద్బుత పోరాటం కనపరిచి ఓడిపోయిన స్టెఫానో సిట్సిపాస్ ట్రోఫీ సెరమనీ సమయంలో కంట తడిపెట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఓడిపోయినందుకు ఎడ్చాడేమో అని అందరూ భావించారు. కానీ దానికి వేరే కారణం ఉన్నదని తర్వాత తెలిసింది. ఫైనల్ మ్యాచ్ ఆడటానికి కోర్టులో అడుగుపెట్టడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు సిట్సిపాస్ నానమ్మ చనిపోయిన వార్త తెలిసింది. చిన్నతనం నుంచి ఆమె వద్దే ఎక్కువగా పెరిగిన సిట్సిపాస్ ఈ విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. దుఖాన్ని దిగమింగుకొని కోర్టులోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
‘జీవితం అంటే గెలవడం, ఓడటం కాదు. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం. అది మనం ఒంటరిగా చేస్తున్నామా అందరితో కలసి చేస్తున్నామా అనేది పట్టించుకోవద్దు. ట్రోఫీలను ఎత్తుకోవడం.. మ్యాచ్‌లు గెలవడం ఒకరకమైన ఆనందం. కానీ అదే జీవితం కాదు. సరిగ్గా కోర్టులోకి అడుగుపెట్టడానికి ఐదు నిమిషాల ముందు నానమ్మ చనిపోయిన విషయం తెలిసింది. నా జీవితంలో కలసిన అత్యంత ఆప్తులలో ఆమె ఒకరు. ఎన్నో విషయాలను నేను ఆమె వద్ద నేర్చుకున్నాను. కలలు కని వాటిని సాకారం ఎలా చేసుకోవాలో తానే నేర్పింది. థాంక్యూ.. మా నాన్నను ఒక మంచి వ్యక్తిగా పెంచినందుకు. ఆయనే లేకుంటే నేను లేను’ అని సోషల్ మీడియాలో సిట్సిపాస్ షేర్ చేసుకున్నాడు.