కేటీఆర్ విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి: టీఎస్‌ఐఐసీ ఛైర్మన్

by Shyam |
కేటీఆర్ విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి: టీఎస్‌ఐఐసీ ఛైర్మన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: పారిశ్రామిక, ఐటీ రంగంలో దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ రంగం మరింత ఖ్యాతిని గడించేలా స్టార్ట‌ఫ్ కంపెనీల‌కు కొత్త ఆలోచ‌న‌ల‌ను అందించేందుకు వీలుగా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా రూ.458.85 కోట్ల‌తో నాలెడ్జ్ సిటీ, రాయ‌దుర్గ‌ంలో చేప‌ట్టిన టీ హ‌బ్‌-ఫేజ్‌-2 బ‌హుళ అంత‌స్తుల నిర్మాణ ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్నాయన్నారు. అలాగే రూ.72 కోట్ల‌తో నాలెడ్జ్ సిటీ, రాయ‌ద‌ుర్గంలో చేప‌ట్టిన టీ-వ‌ర్క్ భ‌వ‌న నిర్మాణ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయని పేర్కొన్నారు. రాయదుర్గంలో టీఎస్ ఐఐసీ నిర్మిస్తున్న టీ-వర్క్స్, టీ-హబ్ 2 బహుళ అంతస్తుల భవన సముదాయాలను ఎండీ నర్సింహారెడ్డి, సీఈ శ్యామ్ సుందర్‌తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు.

గేమింగ్‌, యానిమేష‌న్‌, మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగాల్లో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌ ప్రోత్సాహకానికి రాయ‌దుర్గంలో 6.33ఎక‌రాల్లో ఇమేజ్ ట‌వ‌ర్ పేరుతో రూ.946 కోట్ల వ్య‌యంతో 17అంత‌స్తుల బిల్డింగ్ నిర్మించనునట్లు వెల్లడించారు. టెండ‌ర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వ‌ర‌లో ప‌నులను ప్రారంభిస్తామన్నారు. ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు ఐటీ ప‌రిశ్ర‌మ‌ను విస్త‌రించే క్ర‌మంలో వ‌రంగల్‌లో రూ.7 కోట్ల‌తో ఐటీ ఇంక్యూబేష‌న్ సెంట‌ర్‌, క‌రీంన‌గ‌ర్‌లో రూ.33.40 కోట్ల‌తో ఐటీ ట‌వ‌ర్‌, నిజామాబాద్‌లో రూ.33.40 కోట్ల‌తో ఐటీ హ‌బ్‌ను, ఖ‌మ్మంలో రూ.27.62 కోట్ల‌తో ఐటీ ఇంక్యూబేష‌న్ సెంట‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో రూ.25కోట్లతో ఐటీ ఇంక్యూబేష‌న్ సెంట‌ర్‌ను టీఎస్‌-ఐఐసీ నిర్మిస్తోందన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌ ఏర్పాటుకు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఐదేళ్లలో రూ.2,209 కోట్ల‌ నిధులను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధుల‌తో 9జోన్ల ప‌రిధిలోని పారిశ్రామిక‌వాడ‌ల్లో లేఅవుట్, రోడ్లు, నీరు, విద్యుత్తు ప‌నులు ప్ర‌స్తుతం వివిధ ద‌శ‌ల‌లో కొన‌సాగుతున్నాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed