ఇరిగేషన్ ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులకు రూ.416 కోట్లు

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో :

నీటి పారుదల విద్యుత్ సబ్సిడీలకు గాను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం రూ. 416 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెల విద్యుత్ ఛార్జీల సబ్సిడీకిగాను ఈ నిధులను విడుదల చేసినట్టు జీఓలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 10,400 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించగా, ప్రస్తుత అవసరాలకు పై మొత్తాన్ని విడుదల చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల అవసరాలకు వాడుతున్న మోటారు పంపుసెట్లకు భారీ స్థాయిలో విద్యుత్‌ వినియోగమవుతోంది. కాగా, ప్రతి నెలా బిల్లులను పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ డబ్బును విద్యుత్ శాఖ ద్వారా పంపిణీ సంస్థలకు విడుదల చేసింది.

Tags: Irrigation projects, Electricity bills, Electricity Dept, Ajay Mishra

Advertisement

Next Story

Most Viewed