వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్

by Shyam |   ( Updated:2021-08-14 04:22:41.0  )
telangana smart cities warangal karimnagar
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పింఛన్ పొందడానికి కనీస వయసును 57 ఏళ్ళకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దరఖాస్తు చేసుకోడానికి ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. విద్యార్హత సర్టిఫికెట్లు లేదా బర్త్ సర్టిఫికెట్ లేదా ఓటరు గుర్తింపు కార్డుకు అనుగుణంగా పుట్టిన తేదీని పేర్కొనాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొన్నది. దగ్గరలోని ‘మీ సేవ‘ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే సర్వీసు ఛార్జీని చెల్లిస్తుందని ‘సెర్ప్‘ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సొసైటీ) సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా ఒక సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే సమయానికి లబ్ధిదారుల వయసు 57 ఏళ్ళు ఉండాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సహా అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోడానికి ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉండేలా అన్ని ‘మీ సేవా‘ కేంద్రాలను సమన్వయం చేసుకోవాలని సీఈఓ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed