ఇదెక్కడి విచిత్రం.. హెల్మెట్ లేకుండా లారీ నడిపాడని డ్రైవర్ కి ఫైనా?

by Sumithra |   ( Updated:2021-03-18 01:17:06.0  )
ఇదెక్కడి విచిత్రం.. హెల్మెట్ లేకుండా లారీ నడిపాడని డ్రైవర్ కి  ఫైనా?
X

దిశ,వెబ్ డెస్క్: దేశంలో ట్రాఫిక్ చలానాలు కట్టడానికే సామాన్యుడి జీతం మొత్తం సరిపోతుంది. ట్రాఫిక్ చలానాలను వసూలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కాస్త కఠినంగానే ప్రవర్తిస్తున్నారు. హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ వీటితో పాటు సైడ్ మిర్రర్ లేకపోయినా, బైక్ పై వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోయినా ట్రాఫిక్ పోలీసులు వదలడంలేదు. అయితే హెల్మెట్ పెట్టుకొనే వాహనాలకు హెల్మెట్ లేదని చలానా వేస్తే అర్థముంది. కానీ ట్రక్ లో వస్తున్న వారికి కూడా హెల్మెట్ లేదని చలానా విధిస్తే.. తాజాగా ఒక లారీ డ్రైవర్ కి హెల్మెట్ లేదని రూ.1000 లు జరిమానా విధించిన వింత ఘటన ఒడిశా లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే ప్రమోద్ కుమార్ శ్వైన్ అనే డ్రైవర్ ట్రక్ పర్మిట్‌ను రెన్యూవల్ చేయించేందుకు గంజంలోని స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడ అతనికి గతంలో పడిన చలనాలను అధికారులు చూపించారు. ఆ చలనాలను చూసిన ప్రమోద్ కుమార్ అవాక్కయ్యాడు. గతంలో హెల్మెట్ లేకుండా లారీ నడిపావని.. అందుకే రూ.1000 లు జరిమానా విధించినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్న లారీ డ్రైవర్, లారీలో కూడా హెల్మెట్ పెట్టుకుంటారా సార్..అని ప్రశ్నించాడు. అందుకు అధికారులు..అవన్నీ మాకు తెలియదు. ఈ చలానా డబ్బులు కట్టి ట్రక్ పర్మిట్‌ను పొందాలని ఆదేశించారు. ఇక చేసేదేం లేక ఆ డబ్బులు చెల్లించి ట్రక్ పర్మిట్‌ను పొందాడా లారీ డ్రైవర్.

Advertisement

Next Story