150కుటుంబాలకు నిత్యావసర సరుకుల వితరణ

by  |
150కుటుంబాలకు నిత్యావసర సరుకుల వితరణ
X

దిశ, రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం రంగంపల్లి గ్రామపంచాయతీలో సుమారు 150 కుటుంబాలకు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య నిత్యావసర సరుకులు వితరణ చేశారు. వాటిని గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ శ్రీశైలం, యువనేత అందే రాజేశ్వర్ లతో కలిసి ఇంటింటి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీశైలం, అందే రాజేశ్వర్, ఉప సర్పంచ్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Essential Goods,distribution,TRS state secretary

Advertisement

Next Story