టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో లీక్.. ఎర్రబెల్లిపై సంచలన ఆరోపణ

by Anukaran |   ( Updated:2023-04-13 17:55:53.0  )
Errabelli-dayakar Rao
X

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : సీఎం వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న‌లో పెద్ది సుద‌ర్శన్‌రెడ్డికి అవ‌మానాలు జ‌ర‌గ‌డం వెనుక మంత్రి ఎర్రబెల్లి ప్రోదల్బం, వ్యూహాత్మక వైఖ‌రి ఉందా..? అంటే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి వ్యాఖ్యలకు అదే అర్థం వ‌స్తోంది. సోమ‌వారం సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్‌ ప‌ర్యటనలోని ప‌లు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన పెద్ది సుద‌ర్శన్‌ వాహ‌నాన్ని అడ్డుకోవ‌డంతో మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు నివాసముంటున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వ‌ద్దకు పాద‌యాత్రగా చేరుకుని నిర‌స‌న తెలిపిన విష‌యం తెలిసిందే.

అలాగే జ‌య‌శంక‌ర్ స్మృతివ‌నంలోకి కూడా పెద్ది సుద‌ర్శన్‌రెడ్డికి అనుమ‌తివ్వక‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపం చెందారు. సోమ‌వారం పోలీసులు తన వాహ‌నాన్ని అడ్డుకోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆయన కాలిన‌డ‌క‌న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు వెళ్తున్న ఓ వీడియో దిశ‌కు ల‌భ్యమైంది. ఈ వీడియోలో పెద్ది సుద‌ర్శన్‌ న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా ఓ నాయ‌కుడు బైక్ ఎక్కాల‌ని కోరాడు.. నువ్వు చేసిన‌వ్‌గా.. నువ్వు ద‌యాక‌ర్‌రావు అంటూ ఆగ్రహంగా స‌మాధానం ఇవ్వడం గ‌మ‌నార్హం.

కొంత‌కాలంగా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంపై ఎర్రబెల్లి త‌న సొంత ఎజెండాను అమ‌లు చేసేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌ని పెద్ది సుద‌ర్శన్‌ అనుచ‌రులు పేర్కొంటున్నారు. న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు రేవూరిని, దొంతి మాధ‌వ‌రెడ్డిల‌ను పార్టీలోకి తీసుకు రావాల‌ని, పెద్ది సుద‌ర్శన్‌ ప్రాధాన్యం త‌గ్గించేలా అధిష్టానానికి రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇలా చేయడం వెనుక కొంత‌మంది ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కుట్ర దాగి ఉంద‌ని ఆయన అనుచ‌రులు బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు.

హైద‌రాబాద్‌కు పెద్దిరెడ్డి.. కేటీఆర్‌ను క‌లిసేందుకేన‌ట‌..?!

ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి అధిష్టానం పెద్దల‌ను క‌లిసేందుకు హైద‌రాబాద్‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. సోమ‌వారం సీఎం ప‌ర్యట‌న‌లో త‌న‌పై పోలీసులు వ్యవ‌హ‌రించిన తీరుతో పాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లిపై కేటీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకే హైద‌రాబాద్ వెళ్లిన‌ట్లుగా విశ్వస‌నీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్‌ ప‌ర్యట‌నలోని ప‌లు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన పెద్ది సుద‌ర్శన్‌ వాహ‌నాన్ని అడ్డుకోవ‌డంతో ఈ విష‌యం మీడియాలో ప్రముఖ వార్తగా మారింది.

వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన సీఎం కేసీఆర్ పాల్గొన్న ఏ కార్యక్రమంలో కూడా సదరు ఎమ్మెల్యే పాల్గొన‌కుండానే వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. మీడియాలో ఆయన పాద‌యాత్ర అంశం హాట్ టాపిక్‌గా మార‌డంతో అధిష్టానం పెద్దల నుంచి ఫోన్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇలా ఫోన్ వ‌చ్చిన కొద్దిసేప‌టికే త‌న‌కు ఎలాంటి అవ‌మానాలు జ‌ర‌గ‌లేద‌ని, తాను కావాల‌నే వెళ్లిపోయిన‌ట్లుగా పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి మీడియాకు ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. అయితే సీఎం కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొన‌లేకపోయారు అనే కార‌ణాల‌ను మాత్రం పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed