టీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. ప్రశ్నించినందుకు సర్పంచ్ పై దాడి

by Aamani |
టీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. ప్రశ్నించినందుకు సర్పంచ్ పై దాడి
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా భైంసా మండలం ఈలేగాం గ్రామ పంచాయతీ సర్పంచ్ ముత్యంపై అధికార పార్టీకి చెందిన నాయకులు పలువురు దాడికి పాల్పడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో బాధిత సర్పంచ్ దాడికి గల కారణాలను వివరించారు. టీఆర్ఎస్ లీడర్లు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా తరచూ అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధికి నిధులు మంజూరు విషయంలోనూ అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నారని పేర్కొన్నారు.

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఎప్పటికైనా అధికార టీఆర్ఎస్ నాయకులతో తనకు ప్రాణహాని ఉందని కన్నీరుమున్నీరుగా విలపించారు. అధికార పార్టీ నాయకులు హద్దులు మీరుతున్నారని, ఇప్పటికైనా అదుపులో ఉండాలని సర్పంచ్ ముత్యం హెచ్చరించారు.

Advertisement

Next Story