HRM ఎమ్మెల్సీ: రెండో రౌండ్‌లో కూడా టీఆర్ఎస్..

by Shyam |   ( Updated:2021-03-18 02:50:03.0  )
HRM ఎమ్మెల్సీ:  రెండో రౌండ్‌లో కూడా టీఆర్ఎస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ – రంగారెడ్డి -మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. టీఆర్ఎస్ తన ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రౌండ్ ఓట్లలో 49 వేల ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. టీఆర్ఎస్‌ అభ్యర్థి వాణిదేవి 13,395 ఓట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 12,223 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య 1,172 ఓట్ల తేడా ఉండగా.. రెండో రౌండ్ ఓట్లలో ఇంకా ఏడు వేల ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఓట్ల తేడా తక్కువగా ఉండటంతో చివరికి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.

తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి 17,439 ఓట్లు, సెకండ్ రౌండ్‌లో 17,732 ఓట్లు రాగా.. ఇప్పటివరకు మొత్తం 35,171 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు తొలి రౌండ్‌లో 16,385 ఓట్లు, రెండో రౌండ్‌లో 16,173 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు రామచంద్రరావుకు 32,558 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు తొలి రౌండ్‌లో 8,357 ఓట్లు రాగా.. రెండో రౌండ్‌లో 8,594 ఓట్లు వచ్చాయి. నాగేశ్వర్‌కి ఇప్పటివరకు మొత్తం 16,951 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి తొలి రౌండ్‌లో 5,082, రెండో రౌండ్‌లో 4,980 ఓట్లు రాగా.. ఇప్పటివరకు మొత్తం 10,062 ఓట్లు వచ్చాయి.

తేలిన 3వ రౌండ్ ఫలితం.. 12వేల పైచిలుకు ఆధిక్యంలో

Advertisement

Next Story