- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
’నిరుద్యోగులు పెనం మీద.. ఉద్యోగులు పొయ్యి మీద‘
దిశ, స్టేషన్ ఘన్ పూర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం టీఆర్ఎస్ పార్టీ మీద మండి పడ్డాడు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని ఇది కెసీఆర్ కుటుంబ తెలంగాణ అని అన్నారు. టీజేఎస్ వ్యవస్థాపకుడు ఫ్రోఫెసర్ కొదండరాం నియోజకవర్గంలోని జఫర్గడ్ మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ తమకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను, కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను, ఉపాధ్యాయులను తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కుల మత వర్గ విభేదాలు లేకుండా సబ్బండ కులాలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ ఒక ఇంటికే పరిమితం అయిందని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీలని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. నిధులు, నీళ్లు ఎలా ఉన్నా నియామకాలు మాత్రం కేసీఆర్ కుటుంబానికి దక్కాయని ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెనం మీద ఉంటే ఉద్యోగులు పొయ్యిలో ఉన్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే పట్టభద్రుల ఎన్నికల్లో పోటి చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నామని, అందుకే కొట్లాడగలుగుతున్నామన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గడీల పాలన కు బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి గైని రమేష్, జిల్లా అధ్యక్షుడు అశోక్ వర్ధన్ రెడ్డి, సతీష్ కుమార్, జిల్లా కార్యదర్శి ఉమాపతి, మండల అధ్యక్షుడు కుల్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు.