'మేము సైతం' అంటున్న టాలీవుడ్ డైరెక్టర్స్

by Shyam |
మేము సైతం అంటున్న టాలీవుడ్ డైరెక్టర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని కట్టడికి తమవంతు సాయం చేసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీస్ ముందుకొస్తున్నారు. మేమున్నాం అంటూ ప్రజలకు, ప్రభుత్వానికి భరోసా ఇస్తున్నారు. మాటల మాంత్రికుడు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షల చొప్పున తెలుగు రాష్ట్రాలకు విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించగా… ‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ. 5 లక్షల చొప్పున రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సామాజిక దూరాన్ని పాటించాలని.. లాక్ డౌన్‌ను విజయవంతం చేయాలని .. ఒకరికొకరు దూరంగా ఉంటూ కరోనా చైన్ బ్రేక్ చేయాలని కోరారు. కరోనా మహమ్మారిని పారదోలేందుకు అందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.


Tags: Tollywood, Trivikram Srinivas, Anil Ravipudi, CoronaVirus, Covid19

Advertisement

Next Story