- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడు భూముల పట్టాల కోసం కష్టాలు.. మీ-సేవ కేంద్రాల వద్ద బారులు
దిశ, కొత్తగూడ : పోడు భూముల పట్టాల దరఖాస్తుల స్వీకరణకు మంగళవారం చివరి రోజు కావటంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టాల కోసం దరఖాస్తు చేయాలంటే ధ్రువీకరణ పత్రాలు పొందెందుకు మంగళవారం మీ-సేవ కేంద్రాల వద్ద ఆదివాసీలు బారులు తీరారు. గత కొన్నేళ్లుగా మారుమూల అటవీ గ్రామాలలో నివసించే ఆదివాసీ గిరిజన కుటుంబాలు పోడు వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పోడు సాగు భూములపై అటవీ శాఖ అధికారుల దాడులు ఉధృతం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనతో పోడుదార్లపై దాడులు అరికట్టడానికి అటవీ హక్కుల చట్టంలో భాగంగా వారికి శాశ్వత హక్కు కల్పించాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసే విధానం, అదే విధంగా దరఖాస్తుల స్వీకరణ సమయం, పోడుదార్లు దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన పత్రాలపై విధివిధానాలు సూచించిన విషయం విధితమే. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రాల నిమిత్తం బాధితులు మీ-సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో మీ-సేవ నిర్వాహాకుల తీరుతో ఆదివాసీలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సదరు మీ-సేవ కేంద్రాల నిర్వాహాకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, సాగుభూమి రైతులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే పోడు భూములే కాకుండా ఇళ్ల స్థలాల దరఖాస్తు తీసుకొనుటకు చివరి తేది నవంబర్ 16వ తేది సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చారు. దీంతో మంగళవారం రోజున పోడు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి నానా ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల చివరి తేదీ గడువుకాలం పొడిగించాలని అర్జీదారులు కోరుతున్నారు. పోడు రైతులు కుల ధ్రువీకరణ పత్రం అత్యవసరంగా కావాలంటే మీ-సేవ కేంద్రాలలో ఓ రేటు కేటాయించి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గడువు పొడిగించాలి..
కొత్తగూడ మండల పంచాయితీ కార్యదర్శి సంఘం మండల అధ్యక్షులు: బానోత్ కవిలాల్
పోడు, సాగు భూముల పట్టాల దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ కావడంతో మండలంలో ఉన్న అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు, సాగు భూముల కోసం దరఖాస్తుల స్వీకరణకు నెల రోజుల సమయం ఇవ్వగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 16వరకు నిర్ణయించారు. అయినప్పటికి ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ సమయం మరికొన్ని రోజులు పొడగించాలి.
దరఖాస్తులు పూర్తి చేయడంలో ముందుకొచ్చిన సర్పంచ్..
పట్టాల కోసం పోడు, ఏజెన్సీ సాగుదారులు దరఖాస్తులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయులను కేటాయించారు. దరఖాస్తులు చేసుకోవడానికి సమయం అతి తక్కువగా ఉండటంతో ఇటు అర్జీదారులు మరో పక్క ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పూర్తి కాలేదని మండలంలోని ఎదుళ్లపల్లి సర్పంచ్ ఇర్ప రాజేశ్వర్ ముందుకొచ్చారు. అర్జీదారుల ఇబ్బందులను గమనించి తమ వంతు సాయంగా దరఖాస్తులను పూర్తి చేసేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే నిర్ణీత సమయం పొడిగించాలని కోరారు.
- Tags
- Mee Seva Centers