చనిపోయి బతికిన మహిళ.. అలా ఒక్కసారి కాదు.. మూడుసార్లు..! మరణించిన ప్రతిసారి ఆత్మలతో సంభాషణ

by sudharani |   ( Updated:2023-05-29 14:24:40.0  )
చనిపోయి బతికిన మహిళ.. అలా ఒక్కసారి కాదు.. మూడుసార్లు..! మరణించిన ప్రతిసారి ఆత్మలతో సంభాషణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ మనిషికి, జంతువులకు పుట్టుక, చావు అనేది సాధారణం. ఒకసారే జన్మించి.. ఒకసారే మరణిస్తారు. కానీ, ఓ మహిళ మాత్రం నెలలో మూడుసార్లు మరణించి.. తన శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి కొంతమంది ఆత్మలను కలిసిందట. ఈ విచిత్ర సంఘటన ఇంగ్లాడ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బిర్కెన్ హెడ్‌కు చెందిన బీవెర్లీ గిల్‌మర్ (57) అనే మహిళ చెప్పిన దాని ప్రకారం.. ‘‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు బ్రెయిన్ ట్రోమా వచ్చింది. ఆ సమయంలో నేను చనిపోయిన అనుభూతిని పొందేదాన్ని. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయి శరీరం మెల్లగా పని చేయకుండా ఉండేది. ఇక మెల్లగా నా శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చేది. ఇలా మొదటి సారి నా ఆత్మ బయటకు వచ్చినప్పుడు మా నాన్నని కలిసారు. అప్పుడు ఆయన 52 ఏళ్ల లాగా అనిపించారు. ఎందుకంటే ఆయన ఆ వయసులోనే చనిపోయారు. తర్వాత వాల్ట్ డిస్నీ కంపెనీ అధినేత వాల్ట్ డిస్నీని కలిశారు.

ఆయన నాతో చాలా కథలు చెప్పేవారు. వాల్ట్ డిస్నీ ఉండే ప్రదేశంలో ఓ అద్భుతమైన కట్టడం ఉంది. అది చెక్కతో చేసిన ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. నేను కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన కథల ఆధారంగా బుక్ రాసేదాన్ని.. బొమ్మలు కూడా గీసే దాన్ని. అదే విధంగా రెండో సారి నా ఆత్మ బయటకు వచ్చినప్పుడు మా నాన్నని కలిశాను. ఈసారి ఆయన 30 ఏళ్లుగా కనిపించారు. అంతే కాదు తన కూతుర్ని చూసిన ఆనందంలో ఆయన ఎంతో సంతోషంగా కనిపించారు. ఇలా నా ఆత్మ బయటకు వచ్చిన ప్రతీసారి ఎవరో ఒకరు నాకు కనిపించేవారు. చివరిసారిగా జీసస్‌ను కలిశాను. ఆయన నాతో స్నేహం కూడా చేశారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story