Viral Video: మ్యాచ్ ఓడిపోయారని విద్యార్ధులను చితకబాదిన పీఈటీ..

by Ramesh Goud |
Viral Video: మ్యాచ్ ఓడిపోయారని విద్యార్ధులను చితకబాదిన పీఈటీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుడ్ బాల్ మ్యాచ్ సరిగ్గా ఆడలేదని ఓ స్కూల్ లో విద్యార్ధులను చితకబాదిన ఘటన తమిళనాడులో జరిగింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారడంతో అధికారులు ఆ టీచర్ ను సస్సెండ్ చేశారు. సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో అన్నామలై ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే స్టూడెంట్స్ ఫుట్ బాల్ మ్యాచ్ ఓడిపోయారని అసహనానికి గురైన పీఈటీ సర్ వారిని జెర్సీలతో గ్రౌండ్ లో కూర్చోబెట్టి కొట్టాడు. ఆటలో వారు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ కాళ్లతో తన్నడం చేశాడు. గేమ్ చురుకుగా ఆడలేదని, మీరు పురుషులా? స్త్రీలా? అని వారిపై దుర్భాషలాడుతూ దాడి చేశారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోలో పిల్లలను కొడుతున్న టీచర్ పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తాయి. పిల్లలు సరిగ్గా ఆడకపోతే ప్రాక్టీస్ చేయించాలి కానీ ఈ విధంగా కొట్టడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో పై స్పందించిన సేలం జిల్లాకు చెందిన విద్యాశాఖ సీనియర్ అధికారి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని, ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story