Trending: ఉచిత బస్సు లేదు దిగి వెళ్లిపోండి.. ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా దించేసిన కండక్టర్

by Shiva Kumar |
Trending: ఉచిత బస్సు లేదు దిగి వెళ్లిపోండి.. ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా దించేసిన కండక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం అభాసుపాలవుతోంది. నిత్యం ఎక్కడో ఒకచోట డ్రైవర్, కండక్టర్లపై ప్రయాణికులు దాడులకు తెగబడుతున్నారు. మరి కొన్నిచోట్ల ప్రయాణికులు పరస్పరం దుర్భాషలకు దిగుతూ బాహాబాహీకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లాలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. వేములవాడ రాజరాజేశ్వరుడి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం జగిత్యాల బస్‌స్టాప్‌లో నిలబడ్డారు. అయితే, అప్పడే వచ్చిన ఆర్డీనరీ బస్సులో ప్రయాణికులు ఎక్కుతున్న క్రమంలో కండక్టర్ మహిళలకు ఉచిత ప్రయాణం లేదంటూ వారించారు. ముందు చెకింగ్ ఆఫీసర్లు ఉన్నారని, వారు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారంటూ సదరు ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా బస్సులోంచి దించేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తమకు ఉచిత ప్రయాణమని చెబుతున్నా ఆర్టీసీ సిబ్బంది ఆంక్షలు విధించడం ఏంటని ప్రయాణికులు వాపోతున్నారు.

Next Story