Breaking: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీస్ కస్టడీ

by srinivas |
Breaking: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీస్ కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు అనుమతించింది. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసులో మరింత విచారణ చేపట్టాలని, ఇందుకోసం రెండు రోజుల పాటు పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు పిన్నెల్లిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిన్నెల్లిని లాయర్ సమక్షంలో విచారించాలని సూచించారు.

కాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌పై దాడి చేశారు. అనంతరం మాచర్లలో పలుచోట్ల టీడీపీ శ్రేణులపైనా దాడుల చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలీసు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తపై హత్యయత్నం కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్‌కు తరలించారు. ఇక ఇదే కేసులో పిన్నెల్లిని పోలీసులు కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed