పేకాట స్థావరాల పై పోలీసుల దాడి.. పేకాటరాయుళ్ల అరెస్ట్

by Sumithra |
పేకాట స్థావరాల పై పోలీసుల దాడి.. పేకాటరాయుళ్ల అరెస్ట్
X

దిశ, ఖమ్మం సిటీ : నగరంలో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, ఖానాపురం హవేలీ పోలీసులు కలసి నగరంలోని సాయినగర్ ప్రాంతంలో చెరుకుమల్లి శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పేకాట ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఖానాపురం హవేలీ ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లయ్య, టౌన్ ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్, ఖానాపురం హవేలీ పోలీసులు సంయుక్తంగా ఆదివారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.11,30,670/- నగదు, 3 కార్లు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందుతుల పై సెక్షన్ 3 & 4 ఆఫ్ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

నిందితుల వివరాలు..

చెరుకుమల్లి శ్రీనివాసరావు, (ఆర్గనైజర్) వ్యాపారం, నివాసం, సాయి నగర్.ఖమ్మం.

కొలేటియ ఓంప్రకాష్, వ్యాపారం నివాసం, అమ్ బజార్, ఇల్లందు.

వోరుకొండ ధనుంజయ్ కాంట్రాక్టర్, సుభాష్‌నగర్, ఇల్లందు.

లకావత్ బాబు వ్యవసాయం, నివాసం వుసిరికాయలపల్లి, కారేపల్లి.

ఎస్ కె. హుస్సేన్, ఆటో డ్రైవర్, నివాసం లెనిన్‌నగర్, ఖమ్మం

దాట్ల జగన్నాథం, వ్యవసాయం, నివాసం హనుమంతుల పాడు, సుదిమల్ల, ఇల్లందు.

వంగూరి శ్రీనివాసరావు, కాంట్రాక్టర్, నివాసం అంబజార్, ఇల్లందు.

బొల్లెడు నిరంజన్, వ్యాపారం, నివాసం 21 ఫిట్ ఏరియా, ఇల్లందు.

అల్లం రమేష్, మార్చి గుమ్మస్తా, నివాసం నాయుడుపేట, ఖమ్మం.

బోడ రవి కుమార్, రియల్ ఎస్టేట్, నివాసం రఘునాధపాలెం.

Advertisement

Next Story

Most Viewed