దీన్ని అతిగా తీసుకుంటున్నారా? ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే?

by Anjali |
దీన్ని అతిగా తీసుకుంటున్నారా? ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే?
X

దిశ, వెబ్‌డెస్క్: చింతపండుతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఎక్కువగా దీన్ని చారులో వాడుతారు. చింతపండుతో చారు చేస్తే పుల్లని ఫ్లేవర్‌తో రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే పలు సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చింతపండు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కణాలను హాని నుంచి రక్షిస్తుంది.

చింతపండులో పెక్టిన్, టానిన్స్, టారటారిక్ యాసిడ్, సుక్సినిక్ యాడిడ్, ఎసిటిక్ యాసిడ్, ఆల్కలాయిడ్ ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ చింతపండును మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా 10 గ్రాముల చింతపండు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. లిమిట్ దాటి తీసుకుంటే కనుక దంత సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గుముఖం పడుతుంది. షుగర్ పేషెంట్లు చింతపండుకు దూరంగా ఉండటం బెటర్. అలాగే పిల్లలకు పాలు ఇచ్చే కొత్త తల్లులు కూడా చింతపండు తినవద్దు. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తీసుకోకూడని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed