పేద గౌడ విద్యార్థులకు ఆర్థిక సహకారం : మంత్రి పొన్నం ప్రభాకర్

by M.Rajitha |
పేద గౌడ విద్యార్థులకు ఆర్థిక సహకారం : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నా గౌడ విద్యార్థుల కోసం ఆర్థిక నిధి ఏర్పాటు చేసైనా సహకారం చేయాలని గౌడ్ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా)కు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాజకీయ ఐక్యతతో ముందుకు పోవాలని, గౌడ పారిశ్రామిక వేత్తలకు సైతం గోపా వేదిక కావాలని సూచించారు. హైదరాబాద్ లోని నీరా కేఫ్ లో ఆదివారం గౌడ్ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అధ్యక్షుడు బండి సాయన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి జీవీ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి మొగిలి రఘునాథ్ గౌడ్ తో పాటు ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, కార్యకార్యవర్గ సభ్యులు మొత్తం 50 మందితో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గౌడ సంఘం నాయకులు బుర్ర వెంకటేశం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోపాలో నైపుణ్యం గలవారే ఉంటారని, వారు సమాజానికి.. గౌడ వర్గానికి సంబంధించినవారికి మార్గదర్శం చేయాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం వారికి ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని, ఉపాధి అవకాశాలు కోసం మార్గం చూపాలన్నారు. బ్యాక్ వర్డ్ క్లాస్ ల తరుపున ఇండస్ట్రీ అసోసియేషన్ లేదని, గోపా చొరవ తీసుకొని పారిశ్రామిక వేత్తలను సమీకరించి అసోసియేషన్ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పోటీతత్వంలో నిలబడాలంటే అన్ని రంగాల్లో నిలబడితేనే గౌడ్ లు మనుగడ సాగించగలుగుతారన్నారు.

వంద రోజుల్లో ‘గోపా’లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో లక్ష సభ్యత్వాలు చేయాలన్నారు. ప్రతి గౌడ బిడ్డ గోపా లో సభ్యుడు కావాలన్నారు. ఇందులో సభ్యుడు కావాలంటే చదువుకున్న వారు వృత్తిపరంగా ఉన్నవారు మాత్రమే అవుతారు కాబట్టి జాతికి మార్గదర్శకత్వం చేయాలన్నారు. 33 జిల్లాల్లో కార్యాచరణకు ప్లాన్ చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో గౌడ కులానికి చెందిన మాజీ మంత్రులు, ఐఏఎస్ లు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఎవరున్నా గ్రామీణ స్థాయి వరకు గోపాను తీసుకుపోవాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు వచ్చి.. అధికారం పోగానే దూరమవడం వద్దు అని విజ్ఞప్తి చేశారు. అందరి సహకారం ఆశీర్వాదంతో ముందుకు పోదామని పిలుపు నిచ్చారు. సమాజంలో పరస్పర సహకారంతో ముందుకు పోవాలన్నారు. బుద్ది, సమయం, లక్ష్మి కటాక్షం ఉన్నవారంతా కులానికి సహకరించాలని కోరారు.

బుర్ర వెంకటేశం మాట్లాడుతూ గోప అనేది రాష్ట్రంలో ఒకే ఒక సంఘముగా 50 ఏళ్ల క్రితం ఏర్పడిన సంఘం అని, ఈ సంఘాన్ని జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామస్థాయిలోనూ కమిటీలు ఏర్పడే విధంగా ఈ నూతన కమిటీ ప్రయత్నించి గోపా లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. కమిటీల స్థాపనకు సహాయ, సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు దేవేందర్ గౌడ్, జి రాజేశంగౌడ్,వి. శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ కె స్వామిగౌడ్, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీలు రాజలింగం గౌడ్,గంగాధర్ గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కే సత్యనారాయణగౌడ్, కూన శ్రీశైలంగౌడ్, బిక్షమయ్యగౌడ్, టి నందీశ్వర్ గౌడ్, ఉమన్ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదగౌడ్, టీఎస్పీఎస్సీ మెంబర్ అనిత రాజేంద్ర గౌడ్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఖది విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, బీసీ కమిషన్ మెంబర్ బాలా లక్ష్మీగౌడ్, గౌడ హాస్టల్ అధ్యక్షుడు మోతే చక్రవర్తి గౌడ్, కారింగు బిక్షమయ్య గౌడ్, పాండరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story