- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈబీసీల జోలికొస్తే ఊరుకోం: రవీందర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ బీసీల జోలికొస్తే ఊరుకోమని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ వెంటనే తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది మేధావులు.. ప్రత్యర్థులను దెబ్బతీసే కుట్రలో భాగంగా అగ్రవర్ణ పేదల కడుపు కొట్టే కుట్ర పన్నుతున్నారని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేదరికం అనేది కులం, మతం, ప్రాంతాల ఆధారంగా రాదని గుర్తు చేశారు. అన్ని కులాల్లో, మతాల్లో ధనిక, పేదలు రెండు కేటగిరీలూ ఉన్నాయన్నారు. స్వతంత్య్రం ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా, అగ్రవర్ణ పేదల దుస్థితిని గమనించి విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌కు ప్రధాని మోడీ 10 శాతం రిజర్వేషన్ కేటాయించారని గుర్తు చేశారు. కానీ కొందరు కుల విద్వేషాలు రెచ్చకొడుతూ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్‌పై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ రాజకీయంగా ప్రయోజనం పొందేలా కుట్ర పన్నుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ పార్టీకే అగ్రవర్ణాలను దూరం చేసి, తద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని కొందరు నాయకులు చూస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయంగా ముఖ్యమంత్రులు, మంత్రులను మార్చుకోవడం కోసం అగ్రవర్ణ పేదలను బలిచేస్తే సహించేది లేదని నొక్కి చెప్పారు.