KTR : రైతుబంధు ఎగ్గొట్టి అసమర్థత బయట పెట్టుకున్నారు : కేటీఆర్‌

by M.Rajitha |
KTR : రైతుబంధు ఎగ్గొట్టి అసమర్థత బయట పెట్టుకున్నారు : కేటీఆర్‌
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మీద విరుచుకు పడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు(Rythubandhu) ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి తన అసమర్థతను బయటపెట్టుకున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నపుడు రైతుబంధు సకాలంలో అందించామని, రైతు ఆత్మహత్యలు దాదాపుగా ఆగిపోయాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు ఆపేసి మళ్ళీ రైతులను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. రైతుబంధు దుర్వినియోగం అయిందని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపంట ఎనిమిది నెలల పాటు ఉంటుందని.. పత్తి, కంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, తన అసమర్థతను మరోసారి బయట పెట్టుకున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా(Rythu Bharosa) అమలుపై ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని.. రెండోపంట వేయకపోతే రైతుభరోసా ఇవ్వక పోవడం ఏమిటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు.

Advertisement

Next Story