- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
దిశ,పెగడపల్లి : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. శనివారం మండల కేంద్రంతో పాటుగా అయితుపళ్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను సంబంధిత అధికారులు పకడ్బందీగా నిర్వహించాలి అని, వివరాల నమోదు లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
అదే విధంగా మండల కేంద్రంలో వైకుంఠ ధామం పరిశీలించి అందులో పెరిగిన పిచ్చి మొక్కలను శుభ్రం చేసి దానిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను దగ్గరుండి పర్యవేక్షించి వివరాలను నమోదు చేశారు. కంపోస్టు షెడ్డులు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి వాటిని సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డీపీఓ రఘువరన్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.