రవీంద్రభారతిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

by Sridhar Babu |   ( Updated:2024-10-06 16:06:45.0  )
రవీంద్రభారతిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
X

దిశ, రవీంద్రభారతి : రవీంద్ర భారతిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ అపురూపమైన పండుగని, ఈ పండుగ మనందరిలో గొప్ప శక్తిని, దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయాలని పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.

బతుకమ్మను పేర్చడంలోనే ఒక గొప్ప కళ ఉందన్నారు. పూలనే దేవుడిగా కొలిచే సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. రవీంద్రభారతి లాంటి వేదికలో సకలజనులు, సబ్బండ వర్గాల ప్రజలకు అందుబాటులో ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాషా, సాంస్కృతిక శాఖను ఆమె అభినందించారు. అంతకు ముందు బాగ్ లింగంపల్లి నుంచి లింగంపల్లి వరకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలు సీతక్కకు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు.

Advertisement

Next Story

Most Viewed