Health: మీ బాడీ చిన్న పనులకే అలసిపోతుందా..? ఈ సమస్యలే కారణం..!

by Anjali |
Health: మీ బాడీ చిన్న పనులకే అలసిపోతుందా..? ఈ సమస్యలే కారణం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో లిఫ్ట్ సాయం తీసుకోకుండా నాలుగు మెట్లు ఎక్కితే చాలు అమ్మా.. అయ్యా అంటున్నారు. బాడీ చిన్న చిన్న పనులకే అలసిపోతుంది. కొన్నిసార్లు ఫుడ్ తినకపోతే, ఫీవర్, అనారోగ్యంగా ఉంటే ఇలా అలసటగా అనిపిస్తుంది. మరీ ఎలాంటి కారణం లేకుండా అలసట వస్తే ఏమై ఉంటుంది? అనే సందేహాలు వచ్చాయా? కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సమస్యలే కారణమా..?

చిన్న చిన్న పనులు చేసినా అలసిపోతున్నారంటే దానికి కారణం రక్తహీనత సమస్య ఉండటం కూడా ఓ కారణమే. రక్తంలో సరిపడ ఎర్రరక్త కణాలు లేకపోతే కనుక బాడీ ఊరికే అలసిపోతుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా, డిప్రెషన్, అర్థరైటిస్, నిద్రలేమి సమస్యలు అలసటకు దారితీస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోతే కేవలం అలసిపోవడమే కాదు.. డే మొత్తం ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. దేనిపైన శ్రద్ధ పెట్టలేరు.

అలసటకు దారితీస్తోన్న ఒత్తిడి..

ఇక ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో చాలా మంది సతమతమవుతున్నావు. అటు వర్క్ ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా జనాల్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. కాగా అలసటగా అనిపిస్తే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed