కొండా సురేఖ వ్యాఖ్యలపై ఏఐసీసీ వివరణ అడగలేదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by M.Rajitha |
కొండా సురేఖ వ్యాఖ్యలపై ఏఐసీసీ వివరణ అడగలేదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొండా సురేఖ వ్యాఖ్యలపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ... కొండా సురేఖపై ఏఐసీసీ సీరియస్ అయిందని, మంత్రి స్థానం నుంచి అవుట్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. స్వయంగా ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసిందన్నారు. పార్టీలోనూ ఎలాంటి చర్చ లేదన్నారు. ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా కావాలనే బుదర జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికైన ఆ పద్ధతి మానుకోవాలని సూచించారు. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో కార్యకర్తలంతా అలర్ట్ గా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో గెలిచినప్పుడే, కార్యకర్తలకు, పార్టీ జెండాకు గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ కోసం కష్టబడిన నాయకులను దగ్గరుండి మరీ గెలిపించుకుంటామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. రాబోయే రోజుల్లో దేశమంతా కాంగ్రెస్ దే అంటూ వ్యాఖ్యానించారు. హర్యానా లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతుందన్నారు. రాహుల్ ప్రధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed