- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీలంక టూరుకు రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్?

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల ఆఖర్లో టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు కూడా తెలియజేసినట్టు సమాచారం. ‘పూర్తి స్థాయి క్రికెట్ సీజన్‌కు అందుబాటులోకి రావడానికి సీనియర్లు విశ్రాంతి తీసుకోవచ్చు. రోహిత్, విరాట్, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు వీరు జట్టుతో కలుస్తారు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రోహిత్, బుమ్రా, విరాట్‌లకు గతేడాది నవంబర్ 19న ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే వరల్డ్ కప్ ఫైనలే చివరి వన్డే మ్యాచ్. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో యువ భారత్ జింబాబ్వేలో పర్యటిస్తున్నది. ఈ నెల చివర్లో భారత జట్టు శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూరులో లంక జట్టుతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నెల 27 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు బీసీసీఐ త్వరలోనే జట్టును ప్రకటించనుంది.