లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలి.. కలెక్టర్ రాజార్షి షా

by Sumithra |
లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలి.. కలెక్టర్ రాజార్షి షా
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో 75 వ వజ్రోత్సవ వనమహోత్సవ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, వన మహోత్సవం కార్యక్రమం ద్వారా శాఖల వారిగా కేటాయించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్, కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో వంద శాతం పూర్తి చేసేందుకు శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించి. మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించాలని, ప్లాంటేషన్ పూర్తయిన అనంతరం నాటిన మొక్కల పూర్తి వివరాలను పోర్టల్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. మొక్కలు నాటే స్థలాన్ని మూడు రోజుల్లో పరిశీలించి ఆ స్థలంలో ఎన్ని మొక్కలు నాటవచ్చో, వివరాల పూర్తినివేదిక సమర్పించాలని అన్నారు.

జిల్లాలో ఉన్న 468 జీపీల నర్సరీలలో ఉన్న స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వనమహోత్సవం ద్వారా వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి అటవీశాఖ అధికారులు నిత్యం సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున విరివిగా మొక్కలు నాటాలని, దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు.

గ్రామాలలో, పట్టణాలలో పూలు, పండ్ల మొక్కలను అందచేయాలని సూచించారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన వనమహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ప్రాధాన్యతనిస్తూ, అంకితభావంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో అన్ని శాఖలు, మున్సిపల్ పరిధిలో కలిపి 46 లక్షల వన మహోత్సవం లక్ష్యం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, డీఆర్డీఓ సాయన్న, సంబంధిత శాఖల అధికారులు, ఎంపీడీఓలు, డీపీఎంలు , ఏపీఎంలు, ఎంపీఓలు, డ్వామా ఏఓలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed