కాగజ్‌నగర్‌ లో టాస్క్ ఫోర్స్ దాడులు..

by Sumithra |
కాగజ్‌నగర్‌ లో టాస్క్ ఫోర్స్ దాడులు..
X

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాస్ రావు, ఆదేశాల మేరకు తమకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం కాగజ్‌నగర్‌ పట్టణం గాంధీ చౌక్ సమీపంలోని ఓ నివాసంలో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన విజయ్ తహలాని, ఇంటిలో అక్రమంగా నిలువ ఉంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్ సి.ఐ రానా ప్రతాప్ తెలిపారు. వీటి విలువ రూ. 38,040 వేలు ఉంటుందని, ఆ గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి కాగజ్‌నగర్‌ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు. అతని పై కేసునమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీ.ఐ తెలిపారు. ఈ టాస్క్ లో ఎస్సై వెంకటేశ్వర్లు, పీసీ మధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed