SI Birthday Celebrations: పోలీస్ స్టేష‌న్‌లో ఎస్ఐ బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేపించిన స్థానిక నాయకులపై విమర్శలు

by Maddikunta Saikiran |
SI Birthday Celebrations: పోలీస్ స్టేష‌న్‌లో ఎస్ఐ బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేపించిన స్థానిక నాయకులపై విమర్శలు
X

దిశ, సిద్దిపేట: ఆందోల్(Andole) నియోజకవర్గం వట్‌పల్లి పోలీస్ స్టేష‌న్‌(Vatpally police station)లో కాంగ్రెస్‌ నేత(Congress leader) పుట్టినరోజు వేడుకలు(Birthday Celebrations) నిర్వహించిన విషయం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయం మరవకముందే మరో సంఘటన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ (Siddipet Police Commissionerate) పరిధి బెజ్జంకి పోలీస్ స్టేష‌న్‌(Bejjanki Police Station)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి(SI Krishna Reddy) బర్త్‌డే వేడుకలు పోలీస్ స్టేష‌న్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు హాజరు కాగా ఎస్ఐ కేక్ కట్ చేసి వారికి అక్కడే పంచిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సంఘటనలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరీ. కాగా బెజ్జంకి పోలీస్ స్టేష‌న్‌లో ఎస్ఐ బర్త్‌డే వేడుకల వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో స్థానికంగా వైరల్ అయ్యాయి.




Next Story

Most Viewed