- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బౌలర్‌గా కీలక మైలురాయిని అందుకున్న బుమ్రా
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అంతర్జాతీయ కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకున్నాడు. 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టడంతో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 397 వికెట్లతో ఉన్న బుమ్రా.. ఇప్పుడు 401 వికెట్లకు చేరుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాద్మాన్ ఇస్లాం, ముష్పికర్ రహీమ్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్‌లను పెవిలియన్‌కు పంపాడు. 195 మ్యాచ్‌ల్లో అతను 400 వికెట్ల ఫీట్‌ను చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఘనత సాధించిన 10వ భారత బౌలర్‌గా, 6వ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. పేసర్లలో అతని కంటే ముందు కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(597), శ్రీనాథ్(551), షమీ(448), ఇషాంత్ శర్మ(434) ఈ మైలురాయిని సాధించారు.
Advertisement
- Tags
- #Jasprit Bumrah
Next Story