- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Afghanistan-South Africa: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్..తొలిసారి సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ కైవసం
దిశ, వెబ్‌డెస్క్: అఫ్గానిస్థాన్(Afghanistan) క్రికెట్ జట్టు సంచలన సృష్టించింది.తమ అద్భుతమైన ప్రదర్శనతో అగ్రశ్రేణి దక్షిణాఫ్రికా(South Africa)కు అనూహ్య షాకిచ్చింది.షార్జా(Sharjah) వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డే(2nd ODI)లో దక్షిణాఫ్రికాపై 177 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో ఇంకో వన్డే మిగిలి ఉండగానే తొలిసారి ఆ జట్టుపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. రెండో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ ..నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది.ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz) 105 పరుగులు చేసి సెంచరీతో ఆకట్టుకోగా,అజ్మతుల్లా ఓమర్‌జాయ్(Azmatullah Omarzai) 86 పరుగులు, రహ్మత్ షా(Rahmat Shah) 50 పరుగులు చేయడంతో అఫ్గానిస్థాన్ భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది.నిర్ణీత 34.2 ఓవర్లలో కేవలం134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.ఆ జట్టు తరుపున కెప్టెన్ టెంబ బవుమా(Temba Bavuma) ఒక్కడే 38 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.అఫ్గానిస్థాన్ బౌలర్లలో బర్త్‌డే బాయ్ రషీద్ ఖాన్(Rashid Khan) 5 వికెట్లు తీయగా, ఖరోటే(Kharote) 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచులో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్(5 వికెట్లు)కు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా నామమాత్రమైన చివరి వన్డే షార్జా వేదికగా ఆదివారం జరగనుంది.