అగ్రస్థానంలోనే భారత జట్లు.. చెస్ ఒలింపియాడ్‌లో విజయం దిశగా..

by Harish |
అగ్రస్థానంలోనే భారత జట్లు.. చెస్ ఒలింపియాడ్‌లో విజయం దిశగా..
X

దిశ, స్పోర్ట్స్ : చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు విజయం దిశగా దూసుకెళ్తున్నాయి. 11 రౌండ్లలో 9 రౌండ్లు పూర్తయ్యే సరికి పురుషుల, మహిళల జట్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. టోర్నీలో తొలిసారిగా భారత జట్లు డ్రా పొందాయి. ఓపెన్ కేటగిరీలో పురుషుల జట్టు 2-2 తేడాతో ఉజ్బెకిస్తాన్‌తో డ్రా చేసుకుంది. జట్టులోని నలుగురు తమ గేమ్‌లను డ్రా చేసుకోవడం గమనార్హం. తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేశి.. షంసిద్దీన్‌తో 70 ఎత్తుల్లో పాయింట్లు పంచుకున్నాడు. నోడిర్బెక్‌తో గుకేశ్, సిండరోవ్ జావోఖిర్‌తో ప్రజ్ఞానంద, జఖోంగిర్‌తో విదిత్ సంతోశ్ గుజరాతి తమ గేములను డ్రాగా ముగించారు. మరోవైపు, మహిళల జట్టు కూడా 2-2తో అమెరికాతో పాయింట్లు పంచుకుంది. క్రుష్ ఇరినాపై వంతిక అగర్వాల్ నెగ్గడంతో భారత్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. దివ్య దేశ్‌ముఖ్, తానియా సచ్‌దేవ్ తమ గేమ్‌లను డ్రా చేసుకోగా.. వైశాలి ఓటమిపాలైంది. ప్రస్తుతం టోర్నీలో పురుషుల 17 పాయింట్లతో, మహిళల జట్టు 15 పాయింట్లతో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. టోర్నీలో మిగిలిన రెండు రౌండ్లు భారత జట్లకు కీలకం కానున్నాయి. మిగతా రెండు రౌండ్లలో గెలిస్తేనే విజేత అయ్యే అవకాశం మెండుగా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed