TGPSC Exam Results: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు రిలీజ్.. 81931 మందితో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్

by Maddikunta Saikiran |
TGPSC Exam Results: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు రిలీజ్.. 81931 మందితో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(Hostel Welfare Officer), లేడీ సూప‌రింటెండెంట్(Lady superintendent), వార్డెన్(Warden) తదితర పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫైనల్ కీ(Final Key)తో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్ట్(General Ranking list)ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు 81,931 మందితో, వార్డెన్ అండ్ మ్యాట్రన్‌ పోస్టులకు 497 మందితో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు ప్రకటించారు.ఈ ఉద్యోగాలకు 2022లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా,2024 జూన్ 24 నుండి 29 వరకు పరీక్షలు జరిగాయి.

Next Story

Most Viewed