Israel-Hezbollah War: లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..హెజ్‌బొల్లా టాప్ కమాండర్ మృతి..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-21 00:47:41.0  )
Israel-Hezbollah War: లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..హెజ్‌బొల్లా టాప్ కమాండర్ మృతి..!
X

దిశ, వెబ్‌డెస్క్:ఇజ్రాయెల్(Israel)-హెజ్‌బొల్లా(Hezbollah) మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.లెబనాన్(Lebanon)లో పేజర్లు(Pagers), వాకీ-టాకీల(walkie-talkies) పేలుళ్లతో పశ్చిమాసియా(West Asia) నివురుగప్పిన నిప్పులా మారింది.పేజర్ల పేలుళ్ల కారణంగా లెబనాన్ లో మొత్తం 37 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు.కాగా ఈ పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది.లెబనాన్ లో పేజర్ల, వాకీ-టాకీల పేలుళ్లకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దేశంపై హెజ్‌బొల్లా 140 రాకెట్లతో ప్రతిదాడి చేసింది.ఈ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు పలువురు గాయపడ్డారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం హెజ్‌బొల్లా మిలిటెంట్ల(Hezbollah Militants) స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు(Air strike) నిర్వహించింది. ఈ దాడుల్లో 8 మంది మరణించగా,17 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Lebanon health ministry) తెలిపింది.తాజా వైమానిక దాడితో ఏడాదిలో లెబనాన్ రాజధాని బీరూట్‌(Beirut)పై ఇజ్రాయిల్ దాడి చేయడం ఇది మూడోసారి.అలాగే ఈ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక కమాండర్(Key Commander) ఇబ్రహీం అకిల్‌(Ibrahim Aqil) మరణించినట్లు హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ వర్గాలు తెలిపాయి.అకిల్‌ గతంలో హెజ్‌బొల్లా సైనిక విభాగమైన జిహాద్ కౌన్సిల్ లోనూ పని చేశాడు. అలాగే 1980ల్లో జిహాద్ జరిపిన అనేక దారుణమైన దాడుల్లో అకిల్‌ బాగస్వామ్యమయ్యాడు.కాగా ఏప్రిల్ 1983లో బీరుట్‌లోని అమెరికన్ ఎంబసీ(U.S. Consulate) కార్యాలయంపై జరిపిన బాంబు దాడిలో అకిల్ కీలక సభ్యుడు.ఈ ఘటనలో 63 మంది మృతి చెందారు.ఇతడి ఆచూకీ చెప్పిన వారికి 7 మిలియన్ల బహుమతి ఇస్తామని 2023లో అమెరికా ప్రకటించింది.తాజాగా ఇజ్రాయిల్ సైనిక బలగాలు చేపట్టిన దాడుల్లో ఇబ్రహీం అకిల్‌తో పాటు మరికొందరు చనిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed