- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పతక పంట పండించిన భారత వెయిట్‌లిఫ్టర్లు.. 37 పతకాలు కైవసం
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఫిజిలో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌ను భారత వెయిట్‌లిఫ్టర్లు ఘనంగా ముగించారు. చివరిరోజైన శుక్రవారం కూడా ఐదు పతకాలు దక్కాయి. 96 కేజీల కేటగిరీలో యూత్, జూనియర్ విభాగాల్లో పార్వ్ చౌదరి రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు. మొత్తం 311 కేజీలు ఎత్తి యూత్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్ రికార్డు నెలకొల్పాడు. 81 కేజీల కేటగిరీలో కె.ఓవియా కూడా రెండు మెడల్స్‌తో మెరిసింది. 190 కేజీలు ఎత్తిన ఆమె యూత్ కేటగిరీలో స్వర్ణం, జూనియర్ కేటగిరీలో కాంస్యం దక్కించుకుంది. 81 కేజీల కేటగిరీలోనే కీర్తన కూడా యూత్ విభాగంలో 184 కిలోలతో రజతం గెలుచుకుంది. మొత్తంగా ఈ టోర్నీని భారత్ 37 పతకాలతో ముగించింది. అందులో 23 స్వర్ణాలు, 12 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.
Next Story