బీఆర్ఎస్ తాను తీసిన‌ గోతిలో తానే ప‌డింది.. డీసీసీబీ చైర్మన్

by Sumithra |
బీఆర్ఎస్ తాను తీసిన‌ గోతిలో తానే ప‌డింది.. డీసీసీబీ చైర్మన్
X

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, గతంలో అధికార అహంకారంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రస్తుతం తాను తీసిన గోతిలో తానే పడిన సందర్భం ఎదురైందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి ఆరోపించారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలో చేయ‌ని విధంగా ఏకకాలంలో రెండు ల‌క్ష‌ల రుణ మాఫీ చేస్తున్న మొద‌టి ప్ర‌భుత్వం త‌మ కాంగ్రెస్ స‌ర్కార్ అని అన్నారు. అటు రైతు భ‌రోసా కూడా ఎన్ని ఎక‌రాల‌కు ఇవ్వాలి అని గ్రామ స‌భ‌లు ద్వారా రైతుల అభిప్రాయాల‌ మేర‌కు నిర్ణ‌యిస్తుంద‌న్నారు. నిరుపేద‌ల‌కు ఇందిరమ్మ‌ ఇండ్లు, మ‌హిళ‌లకు 2500 త్వ‌ర‌లో అమ‌లు కానున్నాయన్నారు. ఇక బీఆర్ఎస్ విమ‌ర్శ‌ల‌ పై మాట్లాడుతూ దేవుడున్నాడ‌ని, ఎవ‌రు తీసిన గోతిలోవారే ప‌డ‌తార‌ని బీఆర్ఎస్ తాను తీసిన గోతిలో తానే ప‌డింద‌న్నారు.

ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా కాంగ్రెప్ ఎమ్మెల్యేల‌ను అంగ‌ట్లో స‌రుకులా కొనుగోలు చేసింద‌ని, ఇప్పుడు కేవ‌లం రాష్ట్ర‌ అభివృద్ధి ఆశించి మాత్ర‌మే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నార‌ని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తే పార్టీ నామరూపం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జైనథ్ మాజీ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, మావల మాజీ ఎంపీపీ దర్శనం సంగీత, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed