ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకాలు.. పట్టించుకొని అధికారులు

by Aamani |
ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకాలు.. పట్టించుకొని అధికారులు
X

దిశ, కాప్రా : కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే రోడ్ల తవ్వకాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే రోడ్లను తవ్వి డ్రైనేజ్ కలెక్షన్ తీసుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని, తవ్విన రోడ్లపై వచ్చిపోయే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణ దారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు ఇష్టం వచ్చినట్లు రోడ్ల తవ్వకాలు చేపడుతున్నారు.

రాత్రికి రోడ్లను తవ్వి డ్రైనేజీ పైపులైను వేస్తున్నారు. రోడ్లను తవ్వి డ్రైనేజీ పైపులైను వేయాలంటే ముందుగా అదికారుల అనుమతులు తీసుకుని రోడ్డు కటింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదేమి పట్టించుకోకుండా రోడ్ల తవ్వకాలు చేపడుతున్న ఇంజనీరింగ్ విభాగం అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పద్మశాలి టౌన్ షిప్ లో రోడ్లను తవ్వి డ్రైనేజీ పైపులైను వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed