ముఖ్యమంత్రి కుర్చీలో టిక్‌టార్ స్టార్.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో (వీడియో)

by GSrikanth |
ముఖ్యమంత్రి కుర్చీలో టిక్‌టార్ స్టార్.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టిక్‌టాక్ స్టార్ దుర్గారావు గురించి కొత్త పరిచయం చేయాల్సిన పనిలేదు. లాక్‌డౌన్‌ సమయంలో దుర్గారావు, ఆయన భార్య చేసిన రీల్స్ ఓ ఊపు ఊపాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూనే పలు ఈవెంట్స్‌, షోల్లో దుర్గారావు పాల్గొంటున్నాడు. తాజాగా.. దుర్గారావు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభుత్వ ఆఫీసులలో అధికారుల ముందు అనుమతి లేకుండా కూర్చోవడం కూడా నేరం కిందికే వస్తుంది.. ఇక వీడియోలు తీయడం, రీల్స్ చేయడం వంటి వాటికి పాల్పడితే అటునుంచి అటు జైలుకే వెళ్లాల్సి వస్తుంది.

అలాంటిది దుర్గారావు ఏకంగా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సీటులో కూర్చొని వీడియో చేసి, దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వివాదాస్పదంగా మారింది. కొంతమంది మహిళలతో కలిసి సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లానంటూ దుర్గారావు ఈ వీడియోలో చెప్పాడు. అయితే, ఇది నిజంగా సీఎం క్యాంపు కార్యాలయంలో తీసిన వీడియో కాదని పోలీసులు వివరణ ఇచ్చారు. వీడియో ద్వారా తప్పుడు ప్రచారం చేసిన దుర్గారావుపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story