కౌగిలించుకునే ఉద్యోగం చేస్తోన్నమహిళ.. 4 గోడల మధ్య ఈ ఏజ్ వాళ్లకే చాన్స్.. గంటకెంత తీసుకుంటుందంటే?

by Anjali |
కౌగిలించుకునే ఉద్యోగం చేస్తోన్నమహిళ..  4 గోడల మధ్య ఈ ఏజ్ వాళ్లకే చాన్స్.. గంటకెంత తీసుకుంటుందంటే?
X

దిశ, ఫీచర్స్: ఒక్క హగ్ లో ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. మనిషి ఆనందంలో, బాధలో ఉన్నప్పుడు ఆత్మీయులను కౌగిలించుకోవడం చూస్తూనే ఉంటాం. ఒక్క కౌగిలింత మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆనందంలో ఉన్నప్పుడు మీ ప్రియమైన వ్యక్తికి హగ్ చేసుకోవడం వల్ల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. కౌగిలింత అప్యాయతకు సంకేతం. ఇష్టమైన వ్యక్తులను కౌగిలించుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. భాగస్వాములను కౌగించుకునేవారికి శారీరక స్పర్శలో అరుదుగా పాల్గొనే ఆడవారి కంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని పెన్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

అయితే మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల ఉద్యోగాలు చూశాం. శ్రమ, ఎక్కువ ఆదాయం వచ్చే జాబ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఓ మహిళ చేసే విచిత్రమైన ఉద్యోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు. అనికో రోజ్ అనే మహిళ కౌగిలించుకునే ఉద్యోగం చేస్తుంది. ఈమెను హగ్ చేసుకోవడానికి జనాలు క్యూ కడతారు. అమెరికాలో మాంచెస్టర్ లో ఉంటోన్న అనికో రోజ్ ను కౌగిలించుకోవడం ద్వారా ప్రజలు రిలాక్స్ గా భావిస్తారట.

మరీ ఊరికే కాదండోయ్. గంట సేపు కౌగిలించుకుంటే ఏకంగా 7400 రూపాయలు తీసుకుంటుందట. 42 ఏళ్ల అనికో రోజ్ ఈ జాబ్ మూడేళ్ల నుంచి చేస్తుందట. ఈమెను హగ్ చేసుకోవడం వల్ల ఆక్సిటోన్ హార్మోన్ రిలీజ్ అవుతుందట. దీన్నే లవ్ డ్రగ్ అంటారట. డోపమైన్ అండ్ సెరోటోనిన్ వంటి హార్మోన్ల కారణంగా ఒక మనిషి హ్యాపీగా ఉంటారని, తన దగ్గరకు కౌగిలించుకోవడానికి వచ్చిన వ్యక్తులు 20 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న వారని, ఒక గంట పాటు నాలుగు గొడల మధ్య ఈ ట్రీట్మ్ంట్ జరుగుతుందని అనికో రోజ్ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story