- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur : మణిపూర్‌లో రెచ్చిపోయిన తీవ్రవాదులు.. రైతులు, కూలీలపైకి ఫైరింగ్
దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య రాష్ట్రం మణిపూర్(Manipur)లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రోజు ఇంఫాల్ ఈస్ట్ (Imphal), ఉఖ్రుల్, కాంగ్ పోక్పి జిల్లాల్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు ఘటనలతో కలకలం రేగింది. మధ్యాహ్నం 12.40 గంటలకు ఇంఫాల్ ఈస్ట్ జిల్లా లైఖోంగ్ సీరాంగ్ లౌకోల్ గ్రామ శివారులో ఉన్న పొలాల్లోని రైతులు, కూలీలపైకి సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న గూర్ఖా రెజిమెంట్ బలగాలు వారిని ప్రతిఘటించాయి. 30 నిమిషాల పాటు కాల్పులు, ప్రతికాల్పులు కొనసాగాయి.
ఈక్రమంలో దుండగులు దాదాపు 300 రౌండ్లు ఫైరింగ్ చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలోని సీచంద్ గ్రామానికి చెందిన కుకీ తెగ మిలిటెంట్లు ఈ దాడి చేశారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఉఖ్రుల్ జిల్లా ఫున్ గ్రీతాంగ్ గ్రామంలోని జోనల్ ఎడ్యుకేషన్ ఆఫీసు గేటు వద్ద అనుమానాస్పద స్థితిలో లభ్యమైన సంచిలో హ్యాండ్ గ్రెనేడ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాన్ని వెంటనే నిర్వీర్యం చేశారు. కాంగ్‌పోక్పి జిల్లా కౌత్రుక్ గ్రామంలో పోలీసులపైకి సాయుధ దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిసింది.