- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Donald Trump: ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తాడు.. పాలస్తీనియన్ల ఆశలు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయం కావడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ఆయన ఆపుతారని గాజాలోని పాలస్తీనియన్లు ఆశిస్తున్నారు. బుధవారం గాజాలోని పాలస్తీనియన్లు ట్రంప్ తమను ఈ యుద్ధ వాతావరణం నుంచి బయట పడేస్తారని కోరుకుంటున్నారు. గతేడాది అక్టోబర్‌లో హమాస్ దాడితో మొదలైన సంఘర్షణ కారణంగా గాజా స్ట్రిప్‌లో భారీ సంఖ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది నివాసాలను కోల్పోయారు. లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. తాజాగా అగ్రరాజ్య అమెరికాలో అధికార మార్పు తమను రక్షిస్తుందని పాలస్తీనియన్లు ఆశలు పెట్టుకున్నారు. 'మేమంతా ఉన్న చోటును వదిలి బతుకుతున్నాం. మాతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. తమకు మిగిలిందేమీ లేదు, శాంతి కావాలనుకుంటున్నామని' జబాలియా నుంచి గాజాకు చేరిన ఓ వ్యక్తి మీడియాకు చెప్పారు. ఈ పరిస్థితులను ట్రంప్ పరిష్కరించగలరని, యుద్ధాన్ని ఆపి మమ్మల్ని రక్షించే బలం ట్రంప్‌నకు ఉందని ఓ పాలస్తీనా వృద్ధుడు చెప్పారు. మాకోసం కాకపోయినా, అమాయకులైన తమ చిన్నపిల్లల కోసం యుద్ధం ముగుస్తుందని కోరుకుంటున్నామని బాధితులు పేర్కొన్నారు.